'పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది'

'పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది'

BPT: సంతమాగులూరులోని శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లైబ్రేరియన్ బాదం విజయభాస్కర్‌రెడ్డి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయంలోని పుస్తకాలను పరిచయం చేస్తూ వాటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు.