ఈ నెల 13న మందకృష్ణ మాదిగ రాక..!
కర్నూలు: ఈనెల 13న VHPS, MRPS ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో జరగనున్న బహిరంగ మహాసభకు హాజరుకానున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి ఘన స్వాగతం తెలియజేస్తూ, పోస్టర్‌ను ఆదివారం MEF, MRPS ఎమ్మిగనూరు కార్యకర్తలు విడుదల చేశారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు కోరారు. మందకృష్ణ నాయకత్వం, సామాజిక న్యాయ సాధనలో ఆయన పాత్ర ప్రజలకు దిశానిర్ధేశం చేస్తుందని వారు పేర్కొన్నారు.