దొంగల సొత్తు రికవరీ.. యజమానులకు అప్పగింత
ELR: నిడమర్రు సీఐ నక్కా రజనీకుమార్, ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో ఇటీవల స్వాధీనం చేసుకున్న చోరీ సాత్తును మంగళవారం బాధితులకు అందజేశారు. గుణపర్రుకు చెందిన కే. యేసుబాబు ఇంటికి వెళ్లి దొంగిలించబడిన బంగారు వస్తువులను అప్పగించారు. అదేవిధంగా తోకలపల్లి, మందలపర్రు, భువనపల్లి, సీఎన్ కొలను గ్రామాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, ఫిర్యాదుదారులకు అందజేశారు.