సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు పేదలకు కాంగ్రెస్ నాయకుడు కొలన్ హన్మంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. నిజాంపేటలో జరిగిన కార్యక్రమంలో కుర్వ రంగన్నకు రూ. 36,500, ఆకుల డానియల్‌కు రూ. 25,000, నాగేష్‌కు రూ. 37,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.