తెలంగాణ అమర్‌నాథ్.. సలేశ్వరం ప్రత్యేకత ఇదే..!
NGKL: 'తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర'గా పిలువబడే సలేశ్వరం క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ శివుడు లోయలోని ఒక సహజ సిద్దమైన గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఏడాది పొడవునా మూసి ఉండే ఈ ఆలయం చైత్ర పౌర్ణమి సందర్భంగా కేవలం 3-5 రోజులు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. శివయ్య దర్శనానికి కాలినడక 5-6 KM నడిచి వెళ్లాలి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం భక్తులను కట్టిపడేస్తుంది.