విద్యార్థులను బడికి తీసుకెళ్తున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులను బడికి తీసుకెళ్తున్న ఉపాధ్యాయుడు

NLG: డిండి మండలం కొత్త తండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బాలరాజు బడికి రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని పాఠశాలకు తీసుకొస్తున్నాడు. పిల్లలను పత్తి తీయడానికి, కూలి పనులకు తీసుకెళ్లకుండా క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.