'సిద్దిపేట ప్రాంతానికి తొలి వెలుగు పీవీ'
SDPT: ప్రాంతానికి విద్యుత్ కాంతితో పాటు విద్యా కాంతులను పంచిన మహనీయుడు పీవీ రాజేశ్వరరావు అని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణి కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పీవీ రాజేశ్వరరావు శతజయంతి కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో పాటు, శాసనమండలి సభ్యులు, కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.