'డీజే లేకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి'

NZB: దోమకొండ ఎస్సై స్రవంతి మంగళవారం డీజే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి, వినాయక చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిమజ్జనంలో డీజేను ఉపయోగించరాదని కోరారు. నిమజ్జనం సందర్భంగా పోలీస్ నిబంధనలను విస్మరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛానీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు.