'గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి'
MNCL: గ్రామ అభివృద్ధి పనుల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కుర్సెంగ కళావతి అన్నారు. సోమవారం దండేపల్లి మండలం తాళ్ళపేట్‌లో గ్రామ సభ నిర్వహించారు. సభలో మౌలిక సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సత్తయ్య, మాజీ వైస్ ఎంపీపీ రాజేందర్, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.