ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సునేంద్ర, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణా రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.