ఇద్దరు సీనియర్ అకౌంటెంట్లు సస్పెన్షన్

ఇద్దరు సీనియర్ అకౌంటెంట్లు సస్పెన్షన్

KRNL: జిల్లాలో రూ.కోటికి పైగా ప్రభుత్వ నిధులు దారి మళ్లించడంలో చర్యలు తీసుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్లు వెంకటరావు, పద్మలతలను జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావును సోమవారం సస్పెండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన బిల్లులను సరైన పరిశీలన లేకుండా ఆమోదించారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు.