వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం
మేడ్చల్ జిల్లా పరిధిలో అనేక చోట్ల వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైయ్యాయి. అయితే, మొదటి రకం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి 2,369 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లుగా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సుగుణ బాయి తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని స్థానిక ధాన్యం కేంద్రాల వద్ద విక్రయించుకునే అవకాశం ఉందని తెలిపారు.