'మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలి'

'మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలి'

SRPT: మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటి ప్రాణ వాయువు అందరికీ సంపూర్ణముగా అందేలా ముందు తరాలకు ఇబ్బంది కలుగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.