9 గంటలకల్లా ఫలితాల సరళి!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి ఆ తర్వాత వీవీ ప్యాట్‌లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓటర్లు NDA కూటమి వైపు ఉన్నారా? లేక మహాఘఠ్ బంధన్ కూటమి వైపు ఉన్నారా? అనేది ఉదయం 9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. కాగా, 38 కేంద్రాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.