మరోసారి ఆగిపోయిన మోనో రైలు

ముంబై ప్రజల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోనో రైలు మరోసారి ఆగిపోయింది. ఉదయం 7 గంటల తర్వాత ప్రారంభమైన రైలు కొంత దూరం వెళ్లాక సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలట్ టెక్నికల్ సిబ్బందికి కాల్ చేయగా.. వారు వచ్చి 30 నిమిషాల తర్వాత 17 మంది ప్రయాణికులను రైలు నుంచి బయటకు పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.