నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB: సాలూర మండలంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉ.9 గం. నుంచి 11:30 గం. వరకు సాలూర గ్రామ వ్యాప్తంగా కరెంటు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.