పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పల్నాడు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన కౌలు రైతు రామాంజనేయులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. తన భార్య మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం సాగు చేసిన మిరప, పత్తి పంటలు తుఫాను కారణంగా దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో పురుగుల మందు తాగినట్లు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతిరావు వెల్లడించారు.