నేటి ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

నేటి ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన -2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.