'అలరించిన భరత నాట్య ప్రదర్శన'

HYD: ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అంజనా నాట్యాలయ బృందం గురువు సాయిశ్రీ శిష్యబృందం నిర్వహించిన భరతనాట్య నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. నాట్య సుధా,పుష్పాంజలి,విష్ణుస్తుతి,పలుకే బంగారామాయేనా,ముద్దగారే యశోద,అదిగో అల్లదిగో,ఇదిగో బద్రాద్రి తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.