చోరీ చేసిన నిందితులు అరెస్ట్
SKLM: పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు మైనర్ బాలికలతో పాటు ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.5 లక్షలు నగదు, అర తూలం బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల వీధికి చెందిన మళ్ళా ప్రేమకుమారికి కూల్ డ్రింక్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి రూ. 2.8 లక్షలు, అర తూలం బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు డీఎస్పీ తెలిపారు.