ఘోర రైలు ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర రైలు ప్రమాదం.. 11 మంది మృతి

చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ కున్మింగ్ నగరంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భూకంపాల గుర్తింపును పరీక్షిస్తున్న ఒక టెస్ట్ ట్రైన్, రైలు ట్రాక్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిపై పట్టాలు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ మీడియా సంస్థలు తెలిపాయి. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.