మండపేటలో బీజేపీ 'మహిళా దినోత్సవం'

మండపేటలో బీజేపీ 'మహిళా దినోత్సవం'

కోనసీమ: మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ అన్నారు. మండపేట టౌన్ హాల్‌లో మంగళవారం బీజేపీ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి ప్రధాని మోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.