హిందూపురం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

SS: సికింద్రాబాద్-యశ్వంత్పూర్ వందేభారత్ రైలుకు హిందూపురంలో ఆగే అవకాశం కల్పించేందుకు రైల్వే అధికారులు అంగీకరించారని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూల స్పందన లభించిందని చెప్పారు. రైలు నిలిచే తేదీ వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.