వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

MHBD: బయ్యారం మండల పరిధిలో లక్ష్మీనరసింహపురం, కోడిపుంజుల తండా, మొట్ల తిమ్మాపురం, కోటగడ్డ, కొత్తగూడెం మండలం గాంధీ నగర్ గ్రామాలలో అంతర్గత రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులను గురువారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అద్వేత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.