డ్రగ్స్ ఫ్యాక్టరీపై నివేదిక ఇవ్వండి: జూపల్లి

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ ఫ్యాక్టరీపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీని పెట్టి డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని మండిపడ్డారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. బంగ్లాదేశ్ యువతి ఫాతిమా మురాద్ అరెస్టుతో ఈ డ్రగ్స్ డెన్ బయటపడిన విషయం తెలిసిందే.