VIDEO: 'బస్సు, సెల్ టవర్ మంజూరు చేయాలి'

VIDEO: 'బస్సు, సెల్ టవర్ మంజూరు చేయాలి'

AKP: రావికమతం మండలం పి.కొట్నాబెల్లి పరిధిలోని 7 గిరిజన గ్రామాల ప్రజలు తారు రోడ్డు పూర్తైన నేపథ్యంలో బస్సు సౌకర్యం, సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న పాసలి నుంచి టి.అర్జాపురం వరకు 13 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తక్షణమే వాటిని మంజూరు చేయాలన్నారు.