తప్పుడు ప్రచారం.. 27 మందిపై కేసు
కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధం ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, FB, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ.. తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు ఈ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.