ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా
SDPT: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీఆర్సీ, విలీనం వంటి అంశాలపై అధికారుల కమిటీ నివేదిక రావాల్సి ఉందన్నారు. యూనియన్ నేతలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత పదేళ్ల పరిస్థితులను పరిశీలించి త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, కావున కార్మికులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.