వాహనదారులకు డీజీపీ కీలక సూచనలు
TG: అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. రోడ్ సేఫ్టీ అన్నిటికన్నా ముఖ్యమని అన్నారు. సురక్షిత డ్రైవింగే అన్ని విధాలుగా మేలని పేర్కొన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్లే 75 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వారే ఈ ప్రమాదాల బారిన పడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.