పోలీస్ సిబ్బందికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్

కృష్ణా: పోలీసుల శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేందుకు పామర్రు, పమిడిముక్కల సర్కిళ్ల పోలీస్ సిబ్బందికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, పరేడ్ శుక్రవారం నిర్వహించారు. పామర్రు సీఐ వి. శుభకర్, పమిడిముక్కల సీఐ వై. చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది శారీరక సామర్థ్యాన్ని పరిశీలించారు.