అంగన్వాడీలో కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ
కాకినాడ: సామర్లకోట గణేశ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేయడం కలకలం రేపింది. స్థానిక గర్భిణీ వారం క్రితం పేరు నమోదు చేసుకోగా సిబ్బంది ఆమెకు 13 గుడ్లు అందించారు. ఇంటికి వెళ్లి చూడగా అవన్నీ కుళ్లిపోయి ఉండటంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహారం పేరుతో ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం ఇవ్వడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.