వందల మంది దాడి.. శివంగిలా తిరగబడిన మహిళ

వందల మంది దాడి.. శివంగిలా తిరగబడిన మహిళ

తన ఇంటిని, బిడ్డను రక్షించుకోవడానికి బంగ్లాదేశ్‌లో ఓ మహిళ చూపిన తెగువకు సంబంధించిన వీడియో SMలో వైరలవుతోంది. వందల మంది రాళ్లు విసురుతున్నా, కర్రలతో దూసుకొస్తున్నా.. వెనకడుగు వేయకుండా చేతిలో కత్తి పట్టుకొని శివంగిలా తిరగబడింది. కుటుంబ సభ్యులు భయంతో ఆమెను లాక్కొని వెళ్లగానే అల్లరి మూకలు ఇంటిని ధ్వంసం చేశాయి. ఆవు దొంగతనం చేశారన్న అనుమానంతో దాడి జరిగినట్లు తెలుస్తోంది.