ఏప్రిల్ 23న వేతనంతో కూడిన సెలవు
ఫ్యాక్టరీలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈనెల 23న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా 100% పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కార్మికులంతా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఆ రోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.