ప్రజలు దుష్ప్రచారాలను నమ్మవద్దు: MRO
MLG: యుద్ధం కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తుతుందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మంగపేట MRO రవీందర్ స్పష్టం చేశారు. మండలంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా యథావిధిగా సాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా అయినా సులభంగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించారు.