రాహుల్ గాంధీ కేసులో స్టే పొడిగింపు
భారత్ సైన్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2022 భారత్ జోడో యాత్రలో ఆర్మీపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంను ఆశ్రయించగా.. విచారణను నిలిపివేస్తూ డిసెంబర్ 4 వరకు న్యాయస్థానం స్టేను పొడిగించింది.