మక్బుల్‌ను సన్మానించిన మొహమ్మద్ అజీమ్
సత్యసాయి: కదిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త బీఎస్ మక్బుల్‌ను మొహమ్మద్ అజీమ్ ఘనంగా సన్మానించారు. వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అజీమ్ పేర్కొన్నారు.