VIDEO: సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీస్‌లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రోజురోజుకు కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు