రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: మండల కేంద్రమైన తొండూరులోని NH-716 ప్రధాన రహదారిలో ఉన్న గుంతలో బైకు పడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి టి.తుమ్మలపల్లెకు చెందిన చంద్ర ఓబుల్ రెడ్డి బైకుపై వస్తుండగా NH ప్రధాన రహదారిపై లోతైన గుంత తీసి సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో బైకు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.