VIDEO: దశదినకు వెళుతూ.. అదే చివరి రోజు

కృష్ణా: దశదిన కర్మకు వెళుతున్న దంపతులకు అదే చివరి రోజు అయింది. శుక్రవారం పెదపారుపూడి పరిధిలో జొన్నపాడు పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. గుడ్లవల్లేరు (M) చిన్నగొన్నూరు చెందిన రామానుజరావు సీతామహాలక్ష్మిగా గుర్తించారు. గ్రామంలో అందరితో కలిసి ఉంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగే వీరి మరణం గ్రామస్తులను కలిచివేసింది.