VIDEO: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి భారీ ఆదాయం
SDPT: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి తైబజార్, పశువుల సంత వేలం ద్వారా రూ.89 లక్షల ఆదాయం లభించింది. మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన, కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. తైబజార్‌ను భిక్షపతి రూ.70 లక్షలకు, పశువుల సంతను టి. రాజేశం రూ.19 లక్షలకు దక్కించుకున్నారు. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.