వీధి కుక్కల బీభత్సం.. చిన్నారిపై దాడి

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారిపై దాడి

NRPT: ఊట్కూర్‌లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. గాంధీనగర్ వీధికి చెందిన ఓ పసిపాపపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బుడ్లపోల రాజు కుమార్తె అక్షిత ఇంటి పరిసరాలలో ఆడుకుంటుంది. ఆ సమయంలో 2 వీధి కుక్కలు అక్కడకు చేరుకొని అక్షితపై దాడికి పాల్పడ్డాయి. దీంతో చిన్నారి ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి.