195 ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించిన ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 400 కేజీల రాగి వైరు, 2 ఆటోలు, 2 బైకులు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.