పదేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి
KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని గోపాలకుంట కాలనీలో ఆదివారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. శీలం సాయి (10) అనే బాలుడిపై దాడి చేసి నడుము, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలు చేసింది. బాలుడి అరుపులు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలనీలో కుక్కల బెడద ఉందనీ, మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు.