పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

అసోంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.22,860 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న 'షిల్లాంగ్-సిల్చార్ కారిడార్'కు భూమిపూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్-లేన్ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే, గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుంచి కేవలం 5 గంటలకు తగ్గుతుంది.