రేగిడి సునీతకు అరుదైన గౌరవం
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం, విశ్వేశ్వరయ్య పిహెచ్ స్కీమ్ - 2022 పూర్వ విద్యార్థి డా. రేగిడి సునీతకు అరుదైన గౌరవం దక్కింది. థాయిలాండ్లో జరిగిన USSEG ఫోరమ్-2025 అంతర్జాతీయ సదస్సులో భారత్ తరఫున పాల్గొని పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిపై ప్రసంగించారు. నిర్వాహకుల నుంచి ప్రశంసపత్రం అందుకున్నారు. గురువారం ఏయూ వీసీ రాజశేఖర్ ఆమెను అభినందించారు.