ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో పాల్గొన్న MLA
ATP: జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో MLA దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం, పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు.