'కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ'
NLG: నకిరేకల్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఆరోపించారు. సోమవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.