తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వృద్ధుడి మృతదేహం లభ్యం
GNTR: తెనాలిలోని బాలాజీరావుపేట నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 70 ఏళ్ల వయసున్న ఆ వృద్ధుడు బిక్షాటన చేసుకుంటూ ఇక్కడే నివసిస్తున్నాడని, అనారోగ్యంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.