స్వదేశీ ఉపగ్రహం విజయంలో ధర్మవరం ఇంజినీర్

స్వదేశీ ఉపగ్రహం విజయంలో ధర్మవరం ఇంజినీర్

సత్యసాయి: ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగించిన భారతదేశ అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం విజయంలో ధర్మవరం పట్టణానికి చెందిన ఇంజినీర్‌ అంబటి ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. గత కొంతకాలంగా ఇస్రోలో విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్.. ఈ ఉపగ్రహం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో తోటి ఉద్యోగులు, ధర్మవరంలోని స్నేహితులు ఆయనకు అభినందనలు తెలిపారు.