నేడు పులివెందులలో ఉచిత వైద్య శిబిరం
VSP: పులివెందుల పట్టణంలో ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పురపాలక కమిషనర్ సురేష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య సమస్యలపై ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి, ఈ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.